: 12 మంది ఎంపీలు ఒత్తిడి చేస్తే చాలు, కేంద్రానికి నూకలు చెల్లినట్టే: లగడపాటి
12 మంది ఎంపీలు ఒత్తిడి చేస్తే చాలు కేంద్రానికి నూకలు చెల్లిపోతాయని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ విభజన ఎలాగైనా ఆగిపోతుందన్నారు. ఈ నెల 27 నుంచి కాంగ్రెస్ నేతల సమైక్య సమరం నిర్వహించనున్నామని అన్నారు. ఈ నెల 27,28 తేదీల్లో రాష్ట్రపతిని కలిసి విభజన వల్ల ఏర్పడే సమస్యలను వివరించనున్నట్టు తెలిపారు. రాష్ట్రపతి అంటే రబ్బరు స్టాంపు కాదని, ఆయనకు విశిష్ట అధికారాలు ఉన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు.