: నన్ను, కేజ్రీవాల్ ను అప్రదిష్టపాల్జేసే కుట్ర: అన్నాహజారే


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను, తనను అప్రదిష్ట పాల్జేసేందుకు కుట్ర జరుగుతోందని సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే చెప్పారు. కేజ్రీవాల్ ను దూషిస్తున్నట్లు ఉండే ఒక వీడియో ప్రచారం కావడంపై అన్నాహజారే స్పందించారు. కేజ్రీవాల్ అవినీతిపరుడంటూ తాను వ్యాఖ్యానించలేదని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ తో తనకు ఎలాంటి ఘర్షణ లేదని, ఆయనకు మరోసారి లేఖ రాస్తానన్నారు. వ్యక్తిత్వం ఉన్న వారికే ఓటు వేయాలని, పార్టీలకు కాదని ప్రజలకు అన్నా హజారే పిలుపునిచ్చారు. గూండాలు, అవినీతిపరులను పార్లమెంటుకు పంపరాదని సూచించారు.

  • Loading...

More Telugu News