: ముగిసిన జైరాం రమేష్ భేటీ.. తెలంగాణ ముసాయిదా రెడీ


కేంద్ర హోం శాఖాధికారులతో కేంద్ర మంత్రి జైరాం రమేష్ భేటీ ముగిసింది. దీంతో తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం మరో అడుగు వేసినట్టయింది. విభజనపై కేంద్ర హోంశాఖాధికారులు ఓ ముసాయిదాను తయారు చేసినట్టు సమాచారం. రేపు జరగనున్న జీవోఎం భేటీ ముందుకు నివేదిక తుదిరూపం రానుంది. ఈ నివేదికను చూసి ఖరారు చేయడమే జీవోఎం ముందున్న ప్రక్రియ. నివేదికను జీవోఎం ఆమోదించిన తరువాత, కేబినెట్ ముందుకు దాన్ని ఎప్పుడు తీసుకురావాలనే దానిపై స్పష్టత వస్తుంది.

  • Loading...

More Telugu News