: మణిపూర్ లో అతిపెద్ద పర్యాటక పండగ రేపే ఆరంభం


పది రోజుల పాటు మణిపూర్ లోని ఇంఫాల్ లో జరిగే అతిపెద్ద పర్యాటక పండగ 'సంఘి' రేపటి నుంచి ఆరంభం కానుంది. మణిపూర్ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, సాహసాలకు ఈ పండగ అద్దం పడుతుంది. ఆహారం, చేతి ఉత్పత్తులు కూడా పర్యాటకుల కోసం అందుబాటులో ఉంటాయి. మయన్మార్, థాయ్ లాండ్ నుంచి ప్రత్యేకంగా సాంస్కృతిక బృందాలు ప్రదర్శనల కోసం రానున్నాయి. విదేశీ ప్రతినిధులు రానుండడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News