: ప్రపంచంతో పోటీపడే సత్తా ఉంది: ఒబామా


అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడినపడిందని, గత 44 నెలల కాలంలో 78లక్షల ఉద్యోగాలను కల్పించినట్లు ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. 21వ శతాబ్దంలో ప్రపంచంతో పోటీ పడేందుకు అమెరికా మంచి స్థితిలో ఉందన్నారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాలకంటే తాము చాలా వేగవంతంగా వృద్ధి బాటపట్టామని చెప్పారు. అయితే, తామింకా శ్రమించాల్సి ఉందన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ సీఈవోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా ఈ విషయాలు చెప్పారు. అమెరికా స్టాక్ మార్కెట్లు, కార్పొరేట్ల లాభాలు జోరులో ఉన్నాయన్నారు. కష్టపడే ప్రతీ ఒక్కరి స్వర్గధామంగా అమెరికాను ఇకపై కూడా నిలబెడతామన్నారు. అందులో భాగంగా దీర్ఘకాలిక ఉపాధిపై తాము దృష్టి పెట్టాల్సి ఉందని వివరించారు.

  • Loading...

More Telugu News