: మత్తిచ్చి 21 మంది మహిళా రోగులపై వైద్యుడి రాసలీలలు
వైద్య వృత్తిలో ఉన్నాడు.. చికిత్స కోసం వచ్చిన రోగులను సంరక్షించాల్సిందిపోయి కామకేళి సాగించాడు. అది కూడా వారి సమ్మతి లేకుండా మత్తులో ఉన్నప్పుడు. నాలుగేళ్లపాటు 21 మంది మహిళలపై ఒక కెనడా మత్తువైద్యుడు సాగించిన దారుణాలు 2010లో వెలుగు చూశాయి. టొరొంటోలోని నార్త్ న్యూయార్క్ జనరల్ హాస్పిటల్ లో మత్తువైద్యుడు జార్జ్ డూడ్ నాట్ పై ఈ మేరకు కోర్టులో నేరం నిరూపణ అయింది.
సర్జరీలకు ముందు రోగులకు మత్తు ఇస్తుంటారు. అయితే, ఈ వైద్యుడు మహిళా రోగులు తన చర్యలను అడ్డగించకుండా ఉండేందుకు తగినంత మత్తు ఇచ్చేవాడు. దీనివల్ల వారు కదల్లేకపోయేవారు. కానీ అతడు తమను ముద్దాడుతున్నట్లు, ఇతర లైంగిక చర్యలు చేస్తున్నట్లు తెలుసు. కానీ ప్రతిఘటించలేని స్థితి అంటూ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. వచ్చే నెలలో దోషి అయిన డాక్టర్ కు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.