: గల్లంతైన మత్స్యకారుల్లో నలుగురి ఆచూకీ లభ్యం
ఈ ఉదయం సముద్రంలో రెండు పడవల్లో వేటకు వెళ్లి గల్లంతైన 24 మంది మత్స్యకారుల్లో నలుగురు మత్స్యకారుల ఆచూకీ లభించింది. మిగతావారి కోసం పోలీసుల సాయంతో గాలింపు కొనసాగుతోంది. కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనతో నాగాయలంక మండలం, సొర్లగొంధి వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.