: పట్టపగలు ఏటీఎంలో దారుణం
మనుషుల రక్షణకు భరోసా లేదు. పట్టపగలే ఏటీఎంలో ఓ మహిళపై హత్యాయత్నం ఘటన దేశంలో కలకలం రేపుతోంది. బెంగళూరు నగరంలో ఓ ఏటీఎంలోకి ఓ మహిళ డబ్బులు డ్రా చేసుకునేందుకు ప్రవేశించింది. ఆమె వెంటే ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగ షట్టర్ దింపేశాడు. బ్యాగులోంచి తుపాకీ, వేటకత్తి తీసి బెదిరించాడు. దీంతో అతడి నుంచి తప్పించుకునేందుకు పెనుగులాడింది.
దీంతో ఆగంతుకుడు వేటకత్తితో విచక్షణా రహితంగా గాయపరచి, రక్తం మరకలు తుడిచేసి ఆమె వద్దనున్న బంగారం, డబ్బు, సెల్ ఫోన్ తీసుకుని షట్టర్ తెరచి దర్జాగా వెళ్లిపోయాడు. తరువాత ఏటీఎం కేంద్రం ముందు రక్తం మరకలు చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ కెమెరా పుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.