: కోస్తాంధ్రను ముంచెత్తనున్న వర్షాలు


ఫైలిన్ బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కోస్తాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేసేందుకు మరో అల్పపీడనం సిద్ధంగా ఉంది. బంగాళాఖాతం పరిసరాల్లో స్థిరంగా ఉన్న అల్పపీడనం విశాఖకు దగ్గరగా ఉంది. ఇది రానున్న రెండు రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చి విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఓడ రేవుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వాయుగుండం అల్పపీడనంగా మారిందని, ఇది తుపాను రూపంలో కోస్తాంధ్రను ముంచెత్తనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన నాలుగు పడవలు గల్లంతయ్యాయి. 20 మంది మత్స్యకారుల ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News