: ఆ మాత్రలు మూడేళ్లకు మించి వాడితే కళ్లకు చేటు!


ఏదైనా అతిగా ఉపయోగిస్తే అనర్ధమే. గర్భనిరోధక మాత్రలను కూడా ఎక్కువ కాలం ఉపయోగిస్తే దాని ప్రభావం కళ్లపై పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గర్భనిరోధానికి ఎక్కువమంది మాత్రలను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మాత్రలను కూడా మూడేళ్లకు మించి వాడితే దృష్టిలోపం తలెత్తే ప్రమాదముందని తాజా అధ్యయనంలో తేలింది.

నాన్‌చంగ్‌ యూనివర్సిటీ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో మూడేళ్లకు మించి గర్భనిరోధక మాత్రలను ఉపయోగించే వారిలో కళ్లకు సంబంధించి సమస్యలు తలెత్తే ప్రమాదముందని తేలింది. ఇందుకోసం వారు నలభైఏళ్లు దాటిన 3,406 మంది మహిళలను ప్రశ్నించారు. తర్వాత వారి దృష్టి సామర్ధ్యాన్ని పరీక్షించారు. నోటిద్వారా మూడేళ్లకు పైగా గర్భనిరోధక మాత్రలను తీసుకునేవారు గ్లకోమా బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News