: ఆడవాళ్ల నుంచి రక్షించండి బాబోయ్!
'ఆడవాళ్ల నుంచి రక్షించండి బాబోయ్' అంటూ పురుష పుంగవులు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో కొంత మంది పురుషులు, మహిళల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ, తమకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 498-ఏ చట్టాన్ని బెయిలబుల్ చట్టంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని వారు వాపోయారు.