: టీడీపీని అధికారంలోకి తెండి... 10 రాయితీ సిలెండర్లు పొందండి: బాబు కొత్త తాయిలం


అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలను గుప్పిస్తున్నారు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర, 'తెలుగువారి ఆత్మగౌరవ' యాత్రల్లో ఇచ్చిన హామీలు సరిపోలేదనుకున్నారో ఏమో కానీ, టీడీపీ అధినేత తాజాగా మరో కొత్త తాయిలం వదిలారు. టీడీపీని ఎలాగైనా అదికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు, టీడీపీని అధికారంలోకి తీసుకోస్తే ఏడాదికి 10 రాయితీ సిలెండర్లను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. వికలాంగులకు 1500 రూపాయల ఫించను అందజేస్తామని అన్నారు. బెల్టు షాపులను ఎత్తేస్తామని బాబు వాగ్దానం చేశారు. ఆడపిల్లలకు ప్రత్యేక పథకాలతో పాటు మహిళా సాధికారత కోసం కృషి చేస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News