: కేజ్రీవాల్ కు నాకు శత్రుత్వం లేదు: అన్నా హజారే


ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ కు, తనకు మధ్య శత్రుత్వం లేదని సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పష్టం చేశారు. కేజ్రీవాల్ తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు హజారే తెలిపారు. మహారాష్ట్రలో ఆయన మాట్లాడుతూ, తాము శత్రువులం కాదని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని అన్నారు. కేజ్రీవాల్ తో మాట్లాడేందుకు తానూ సిద్ధంగా ఉన్నానని, అయితే తనతో కేజ్రీవాల్ మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియదని అన్నారు. త్వరలోనే కేజ్రీవాల్ ను కలుస్తానని హజారే తెలిపారు. లోక్ పాల్ ఉద్యమం కోసం 2011లో సేకరించిన విరాళాలను కేజ్రీవాల్ వాడుకున్నాడంటూ నిన్న ఓ ఆగంతుకుడు దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News