: సచిన్ కు భారతరత్నపై ఈసీని ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త
క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు భారతరత్న ప్రకటించడంపై దెబాషిష్ అనే ఆర్టీఐ కార్యకర్త భారత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. సచిన్ కు ఈ పురస్కారాన్ని ప్రకటించడం ఎన్నికల కోడ్ నిబంధన కిందకు వస్తుందని ఈసీకి దరఖాస్తు చేసిన పిటిషన్ లో పేర్కొన్నాడు. సచిన్ కాంగ్రెస్ నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యుడు అయినందున ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం లోని ఓటరు అభిమానులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వివరించారు.