: టాటా మొబైల్లో ప్రకటలు చూస్తే.. ఫ్రీగా మాట్లాడుకోవచ్చు
మీరు టాటా డొకోమో కస్టమర్లా... అయితే మీ పంట పండినట్లే. ఉచితంగా కాల్స్ చేసుకునే సదుపాయాన్ని టాటా డొకోమో అందుబాటులోకి తీసుకురానుంది. కాకపోతే కాల్స్ చేసుకునే ముందు మొబైల్లో ప్రకటనలు చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి టాటా ఇప్పటికే పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆయా కంపెనీల ప్రకటనలను మొబైల్స్ లో ప్రదర్శించడం ద్వారా టాటా డొకోమో తన ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు కస్టమర్లకు ఉచిత టాక్ టైమ్ లభించేలా ఈ ఆలోచనను అమల్లో పెట్టింది. సీడీఎంఏ, జీఎస్ఎమ్ విభాగాల్లోని కస్టమర్లకు ఈ అవకాశం ఉంటుంది. వైఫై, టాటా ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి.