: విమానం మరుగుదొడ్డిలో 24కేజీల బంగారం


కోల్ కతాలోని ఎన్ఎస్సీ బోస్ విమానాశ్రయం. నిన్న రాత్రి వేళ బ్యాంకాక్ నుంచి ఒక విమానం వచ్చింది. ప్రయాణికులు దిగివెళ్లిపోయారు. పనివాళ్లు విమానాన్ని శుభ్రం చేసే పనిలో పడ్డారు. మరుగుదొడ్లో రెండు బ్యాగులు కనిపించాయి. బాంబులేమోనని భయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. వాటిని తెరచి చూడగా.. ఒక్కోటీ కేజీ బరువున్న 24 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ 7.22కోట్ల రూపాయలని అంచనా. తనిఖీలలో దొరికిపోతామనే భయంతో స్మగ్లర్లు వాటిని విమానంలో వదిలి వెళ్లిపోయి ఉంటారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News