: ఐదేళ్లపాటు పాక్ కు అమెరికా భద్రతా సహకారం
పాకిస్థాన్ కు అమెరికా ఐదేళ్లపాటు భద్రతాపరమైన సహకారం అందించనుంది. తిరుగుబాటు దారులు, ఉగ్రవాదులను అణచివేసేందుకు రెండు దేశాలు కలిసి సంయుక్తంగా రూపొందించుకున్న ప్రణాళికలో భాగంగా ఈ సహకారం అందిస్తుంది. దీంతో రెండు దేశాల మధ్య బంధం మరింత దృఢపడనుంది. అమెరికా రక్షణ విభాగానికి చెందిన అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందం ఈ వారం చివర్లో పాక్ లో పర్యటించనుంది.