: మరో 10 బస్సులు సీజ్
నిబంధనలను పాటించని ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. తనిఖీలలో భాగంగా ఈ ఉదయం గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో 4, హైదరాబాద్ శివార్లలో మరో 6 బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద వోల్వో బస్సు దగ్ధమై 45 మందికిపైగా సజీవదహనం అయిన తర్వాత రవాణా శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.