: చావెజ్ అంత్యక్రియలకు హాజరుకానున్న సచిన్ పైలట్
నింగికేగిన వెనిజులా యోధుడు హ్యూగో చావెజ్ అంత్యక్రియలకు భారత్ ప్రభుత్వ ప్రతినిధిగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పైలట్ హాజరు కానున్నారు. ఈమేరకు భారత కేంద్ర ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటన చేశారు. కాగా, చావెజ్ అంత్యక్రియలు రేపు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.