: జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు: రేవంత్ రెడ్డి
ప్రజల ముందు సమైక్యవాదం అంటున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ ముందు విభజనకు తలాడిస్తున్నారని, బయటకు వచ్చి సమైక్యవాదం వినిపిస్తున్నారని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును విమర్శిస్తే సోనియా గాంధీ తనకు సీఎం పదవి ఇస్తుందని జైపాల్ రెడ్డి ఆశిస్తున్నారని మండిపడ్డారు. జైపాల్ రెడ్డి దృష్టిలో సమన్యాయం అంటే తనను సీఎంను చేసి, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.