: మెజారిటీ ప్రజల మనోభావాలు పరిగణనలోకి తీసుకోవాలి: కావూరి ఉదయభాస్కర్
కేంద్రప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో మెజార్టీ ప్రజల మనోభావాలు పరిగణనలోకి తీసుకోవాలని సమైక్య ఆంధ్రప్రదేశ్ మూమెంట్ ఆఫ్ బాపట్ల డిమాండ్ చేస్తోంది. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని సమైక్య ఆంధ్రప్రదేశ్ మూమెంట్ ఆఫ్ బాపట్ల కన్వీనర్ కావూరి ఉదయభాస్కర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా బీజేపీ, సీపీఐ, ఆర్ఎల్డీ నేతలను కలిసి సమైక్యంపై హామీ పొందినట్టు ఆయన తెలిపారు. సీమాంధ్ర రాజకీయ నాయకులను, కేంద్ర, రాష్ట్ర మంత్రులను నమ్మిన సమైక్యాంధ్రులను నిట్టనిలువున మోసం చేశారని కావూరి ఉదయ భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.