: ఆధార్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయనున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
వంట గ్యాస్ సబ్సిడీకి, ఆధార్ కార్డుకు లింకు పెట్టడాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గ్యాస్ సబ్సిడీ పొందడానికి ఆధార్ కార్డు అవసరం లేదంటూ... అసెంబ్లీలో తీర్మానం చేయాలని మమత ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికీ చాలా మందికి అధార్ కార్డులు అందలేదని... ఈ పరిస్థితుల్లో దీన్ని గ్యాసుతో ముడిపెట్టడం తగదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ విషయంతో ప్రధాని కలగజేసుకోవాలని ఆమె కోరారు. ఆధార్ ను కంపల్సరీ చేయరాదని ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా చెప్పిందని తృణమూల్ నేత పార్థా చటర్జీ తెలిపారు.