: మోడీ ప్రచారంతో కాంగ్రెస్ కే లాభం: సింధియా
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీకే లాభమని కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. ఇండోర్ లో ఆయన మాట్లాడుతూ మోడీ తమ రాష్ట్రానికి రావడం వల్ల కాంగ్రెస్ కే మేలు జరుగుతుందని అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకుంటామన్న విశ్వాసం బీజేపీలో సన్నగిల్లుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించడంతో జ్యోతిరాధిత్య సింధియాయే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న ప్రచారం మధ్యప్రదేశ్ లో జోరుగా సాగుతోంది. కానీ దీనిపై జ్యోతిరాధిత్య నోరు విప్పడం లేదు.