: రాష్ట్ర విభజనతో నక్సలిజం పెరుగుతుంది : సీఎం
విభజన వల్ల మతతత్వం, నక్సలిజం పేట్రేగే అవకాశాలున్నాయని సీఎం కిరణ్ చెప్పారు. నక్సలైట్ నాయకుల్లో 80 శాతం మంది అగ్రనాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే అని చెప్పారు. రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాలలో నక్సలిజం సమస్య భారీగా పెరుగుతుందని అన్నారు. ఇది జాతీయ భద్రతకు కూడా ముప్పుతెస్తుందని తెలిపారు. జీవోఎంతో భేటీ అనంతరం ఏపీ భవన్లో సీఎం మీడియాతో మాట్లాడారు.
ఒక లెటర్ తో పాటు అన్ని వివరాలతో రెండు పుస్తకాలను జీవోఎంకు సమర్పించామని ఈ సందర్భంగా సీఎం కిరణ్ తెలిపారు. రాష్టాన్ని విభజిస్తే ఎన్నో సమస్యలు తలెత్తుతాయని జీవోఎంకు స్పష్టం చేశామని తెలిపారు. అన్ని వసతులు హైదరాబాద్ లోనే ఉన్నందువల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పినట్టు తెలిపారు. రాజధాని, ఆర్టికల్ 371-డీ విషయంలో చాలా సమస్యలు వస్తాయని చెప్పారు. సాగునీటి విషయంలో ఇరు ప్రాంతాల్లో సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.