: బాలికపై అత్యాచారం చేసి బీరువాలో బంధించిన కామాంధుడు


హైదరాబాదులోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ కామాంధుడు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, బీరువాలో బంధించాడు. కుత్బుల్లాపూర్ సంజయ్ గాంధీ నగర్ కాలనీకి చెందిన బొబ్బులు(26) స్థానిక మెకానిక్ సర్వీస్ సెంటర్లో పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికకు చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేసి బీరువాలో బంధించి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు.

బాలిక కోసం కాలనీ అంతా వెతికిన తల్లిదండ్రులు బొబ్బులుపై అనుమానంతో అతని ఇంటి తాళం పగులగొట్టి చూడగా, బీరువాలో తీవ్ర అస్వస్థతతో బాలిక కనిపించింది. దీంతో బాలికను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో బొబ్బులుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News