: బూతు సైట్లను నిరోధించడం ఎలా: టెలికాం శాఖకు సుప్రీం ప్రశ్న
ఇంటర్నెట్ లో అశ్లీల దృశ్యాలు అందుబాటులో ఉండడం, పిల్లలపై ఇవి చెడు ప్రభావాన్ని చూపుతుండటంపై సుప్రీంకోర్టు స్పందించింది. అశ్లీల దృశ్యాలలో పిల్లలను చూపించే బూతు సైట్లను నిరోధించడం ఎలా? అంటూ సర్వోన్నత న్యాయస్థానం టెలికాం శాఖకు నోటీసులు పంపింది. వీటిపై సమగ్ర నివేదికను అందజేయాలంటూ టెలికాం శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్ తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అశ్లీల సైట్ల ప్రభావం అధికంగా ఉండడంతో వీటిని నిరోధించాలన్న డిమాండ్లు తరచూ వినిపిస్తుండటంతో... వాటిని అరికట్టే దిశగా సుప్రీంకోర్టు అడుగులు వేస్తోంది.