: జీవోఎం ముందు అందరం ఒకే వాయిస్ వినిపించాం: జేడీ శీలం


రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూనే జరిగిందని, అందువల్ల రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని జీవోఎంకు సూచించినట్టు కేంద్రమంత్రి జేడీ శీలం తెలిపారు. ఢిల్లీలో జీవోఎంతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ... రాజధాని, జల వనరులు, ఉద్యోగ, ఉపాధి, ఆదాయ వనరులన్నింటిపై పూర్తిగా చర్చించామని అన్నారు. విభజన వద్దని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరినట్టు తెలిపారు.

విభజన అనివార్యమైతే, విభజన వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాకే ముందడుగు వేయాలని జీవోఎంకు సూచించామన్నారు. విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించకుండా విభజనకు అంగీకరించమని జీవోఎంకు తెలిపినట్టు ఆయన స్పష్టం చేశారు. విభజన అనివార్యమైతే హెచ్ఎండీఏ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని తాము సూచించినట్టు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News