: అరుదైన అమెరికా నాణాలకు రూ. 142కోట్లు
1800 అమెరికా నాణాలను వేలానికి పెడితే కోట్ల రూపాయల వర్షం కురిసింది. మిస్సోరీకి చెందిన విశ్రాంత లాయర్ ఎరిక్ పీ న్యూమన్ అనే 102 ఏళ్ల వ్యక్తి ఈ నాణాలను సేకరించారు. వీటిని న్యూయార్క్ నగర వేలంలో పెట్టగా.. 142కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఈ 1800 నాణాలకు ఎరిక్ సుమారు 4.65లక్షల రూపాయలే ఖర్చు చేసినట్లు హెరిటేజ్ ఆక్షన్స్ కో చైర్మన్ జిమ్ హాల్పరిన్ తెలిపారు.