: కాసేపట్లో జీవోఎం ముందుకు సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు


మరి కాసేపట్లో నార్త్ బ్లాక్ లోని షిండే కార్యాలయంలో సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు జీవోఎంతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించడమే కాకుండా... లేఖను కూడా ఇవ్వనున్నారు. జీవోఎంకు సమర్పించడానికి 7 పేజీల నివేదికను వీరు సిద్ధం చేసుకున్నారు. కొంత సేపటి క్రితమే పళ్లంరాజు నివాసంలో భేటీ అయిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు... తాము ఇప్పటికీ సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే చిరంజీవి, పళ్లంరాజు, పనబాక, కావూరి నార్త్ బ్లాక్ చేరుకున్నారు.

  • Loading...

More Telugu News