: హైదరాబాద్ పై ఎలాంటి ఆంక్షలకు ఒప్పుకోం : జీవోఎంకు చెప్పిన టీ.మంత్రులు


జీవోఎంతో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు, హైదరాబాద్ పై ఎలాంటి ఆంక్షలు విధించరాదని జీవోఎంను కోరారు. హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ ను మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేయాలని సూచించారు. సీడబ్య్లూసీ నిర్ణయం ప్రకారం 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని తెలిపారు. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమని స్పష్టం చేశారు. గోదావరి జలాలపై కేంద్రం అజమాయిషీ అవసరం లేదని అన్నారు. కృష్ణా జలాల కేటాయింపుల్లో యథాస్థితిని కొనసాగించాలని కోరారు. సమావేశంలో పోలవరం ముంపుపై టీ.మంత్రులు అభ్యంతరం లేవనెత్తారు. హైదరాబాద్ శాంతిభద్రతల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల డీజీపీలతో కమిటీ వేయాలని సూచించారు. హైదారాబాద్ ఆదాయ పంపిణీని తాము అంగీకరించమని తెలిపారు. విద్యుత్ పంపిణీలో పదేళ్ల పాటు ప్రస్తుత స్థితినే కొనసాగించాలని కోరారు.

  • Loading...

More Telugu News