: నేటి రాత్రి నుంచి బద్రీనాధ్ ఆలయం మూసివేత
ప్రఖ్యాత బద్రీనాధ్ ఆలయాన్ని ఈ రోజు రాత్రి 7.38 గంటలకు మూసివేస్తారు. శీతాకాలం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. 'చార్ ధామ్' గా పేర్కొనే గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాధ్, బద్రీనాధ్ ఆలయాలను శీతాకాల సమయంలో మూసివేసి, ఆ తర్వాత తిరిగి తెరవడం సంప్రదాయంగా వస్తోంది.