: నేడు కేంద్రమంత్రుల బృందం (జీవోఎం)తో వరుస భేటీలు
రాష్ట్ర విభజనపై కేంద్రమంత్రుల బృందం(జీవోఎం) తో ఈ రోజు వరుస భేటీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 10.30 గంటలకు తెలంగాణ కేంద్రమంత్రులు, 11.30 గంటలకు సీమాంధ్ర కేంద్రమంత్రులు, మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జీవోఎం తో భేటీ కానున్నారు.