: ఈ రోబో పశువులకాపరి
రోబోలను వయసు మీరిన వారికి సహాయక చర్యల్లోను, ఇండ్లలో పనులు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాకాకుండా పశువులను కాసేందుకు కూడా ఉపయోగించేందుకు ఒక కొత్త రకం రోబోను పరిశోధకులు తయారుచేశారు. ఈ రోబో చక్కగా చక్రాలేసుకుని తిరిగేస్తూ ఆవులను జాగ్రత్తగా కాస్తుంటుంది.
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన శాస్త్రవేత్తలు పశువుల కాపరి వంటి రోబోను తయారుచేశారు. ఈ రోబో చక్కగా పనిచేస్తుందని చెబుతున్న శాస్త్రవేత్తలు ముందుగా దీని పనితీరును పరిశీలించడానికి ఒక నమూనా రోబోను కొందరు రైతులకు ఇచ్చి పరిశీలించగా, అది చక్కగా పనిచేసిందని చెబుతున్నారు. అయితే ఈ రోబో తనంతట తానుగా పనిచేయదు. దీన్ని రైతులే నడిపించాలి. ఈ రోబోను మరింతగా అభివృద్ధి చేసి తనంతటగా తాను నడిచేలా, నిర్ణయాలను తీసుకుని ఆవులను అదిలించి, అదుపులో పెట్టగలిగేలా తయారు చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటివి మన దేశంలో కాదుగానీ... పశుసంపద ఎక్కువగా ఉండే దేశాలకు బాగా ఉపకరిస్తాయి.