: రేపు వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం


వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం హైదరాబాదు, మాసబ్ ట్యాంక్ వద్ద కాజా మేన్షన్ ఫంక్షన్ హల్లో రేపు ఉదయం తొమ్మిది గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ పరిశీలకులు, సీజీసీ, సీఈసీ సభ్యులు, అసెంబ్లీ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులకు ఆహ్వానం పంపినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News