: దొంగలెవరో ప్రజలే తేలుస్తారు : కిషన్ రెడ్డి
భాజపా దొంగల పార్టీ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగిన లక్షల కోట్ల కుంభకోణాలపై నోరు విప్పని రాహుల్, బీజేపీపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. దేశంలో నిజమైన దొంగలు ఎవరనేది వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు మోపి జైళ్లకు పంపిన కాంగ్రెస్ నేతలు... ఇప్పుడు జైత్రయాత్రలు చేపట్టడం సబబేనా? అని ప్రశ్నించారు.