: సచిన్ ఔట్ కావడంతో ఏడ్చిన అచ్రేకర్
వాంఖడే స్టేడియంలో చివరి టెస్ట్ మ్యాచ్ లో సచిన్ 74 పరుగులకు ఔటైనప్పుడు... అతని గురువు రమాంకాంత్ అచ్రేకర్ ఏడ్చేశారు. ఈ విషయాన్ని అచ్రేకర్ కూతురు కల్పన తెలిపారు. సచిన్ ఔటైన కాపేపటికి బాధను తట్టుకోలేక తన తండ్రి ఏడ్చేశారని కల్పన మిడ్ డేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే, రెండో ఇన్నింగ్స్ లో సచిన్ మరోసారి బ్యాటింగ్ కు వస్తాడని తాను ఓదార్చడంతో బాధను అణచుకున్నారని తెలిపారు. 71 ఏళ్ల రమాకాంత్ అచ్రేకర్ తన ప్రియ శిష్యుడి చివరి ఆటను వాంఖడేలోని ప్రెసిడెంట్ బాక్స్ లో కూర్చొని వీక్షించారు.