: పూర్తి చేయని ప్రాజెక్టుని ఎలా ప్రారంభిస్తారు : దేవినేని ఉమ


జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు పులిచింతలను ఇంత వరకు పూర్తిచేయలేదని... అలాంటిది ప్రాజెక్టును సీఎం ఎలా ప్రారంభిస్తారని తెదేపా నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. ఏళ్ల తరబడి నిర్మాణాన్ని సాగదీసిన ప్రభుత్వం, ఇప్పుడు హడావిడిగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవడం ఏమిటని విమర్శించారు. రచ్చబండ కార్యక్రమాన్ని తెదేపాపై విమర్శలు చేయడానికి ఉపయోగించుకుంటున్నారని అన్నారు. సమస్యలపై ప్రజలు నిలదీస్తారన్న భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News