: విమానం నుంచి పడిపోయిన ప్రయాణికుడి మృతదేహం గుర్తింపు
మూడు రోజుల క్రితం విమానంలోంచి పడిపోయిన ప్రయాణికుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. అమెరికాలో ఒక చిన్న విమానం 2వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. 42ఏళ్ల ప్రయాణికుడు డోర్ తెరిచాడని, ప్రమాదవశాత్తూ జారి మియామీ సమీపంలో సాగరంలో పడిపోయినట్లు పైలట్ గ్రౌండ్ కంట్రోలింగ్ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు రెండు రోజుల తర్వాత ఆ ప్రయాణికుడి మృత దేహాన్ని గుర్తించారు.