: యూపీఏ అస్తవ్యస్త పాలనతోనే ఐటీ రంగానికి కష్టాలు: మోడీ


యూపీఏ అస్తవ్యస్త పాలన వల్లే దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం కష్టాలను ఎదుర్కొంటోందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. యూపీఏ పాలనపై ఆయన బెంగళూరు సభా వేదికగా మండిపడ్డారు. అభివద్ధిలో బెంగళూరు నగరం ముందుందన్నారు. ఐటీ రాజధానిలో అదే అంశాన్ని మోడీ తన ప్రసంగంలో ప్రధాన అంశంగా చేసుకున్నారు. తద్వారా బెంగళూరులో అత్యధికంగా ఉన్న ఐటీ ఉద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

భారత ఐటీ ఇంజనీర్లు ప్రపంచానికి తమ సత్తా ఏంటో చూపించారంటూ ప్రశంసించారు. దేశంలో తొలిసారిగా ఐటీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ఘనత వాజపేయికి దక్కుతుందన్నారు. యూపీఏ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని, రూపాయి విలువ పతనం అయిందన్నారు. పాలన స్తంభించిపోయిందని వ్యాఖ్యానించారు. తనపై కాంగ్రెస్ కుట్రలకు పాల్పడుతోందన్నారు. భారతరత్న బిరుదుకు ఎంపికైన సచిన్, సీఎన్ఆర్ రావుకు మోడీ అభినందనలు తెలిపారు. ఏ పార్టీ చూడనటువంటి జనసందోహాన్ని తాను ఈ రోజు చూస్తున్నానంటూ సభ ప్రారంభంలో మోడీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News