: ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత యూపీఏ మనుగడ కష్టం : లగడపాటి


ప్రస్తుతం జరుగుతున్న, జరగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత యూపీఏ మనుగడ కష్టసాధ్యంగా మారనుందని లగడపాటి తెలిపారు. ఈ ఎన్నికల అనంతరం చాలా పార్టీలు యూపీఏ నుంచి దూరంగా జరిగే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు. ఫలితాల తర్వాత భాగస్వామ్య పక్షాలు యూపీఏకు తమ మద్దతు ఉపసంహరించుకుంటాయని అన్నారు. దీంతో, ప్రభుత్వ మనుగడే సందిగ్ధంలో పడుతుందని తెలిపారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాదని లగడపాటి కుండబద్దలు కొట్టారు. తెలంగాణ ముసాయిదా బిల్లు సీఎం దగ్గరకే వస్తుందని... సీఎంకు అంగీకారయోగ్యమైతేనే అది ఆమోదం పొందుతుందని అన్నారు. బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తేనే రాష్ట్ర విభజన జరుగుతుందని చెప్పారు. రెండుసార్లు అధికారం కట్టబెట్టిన ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News