: మోడీని ఆహ్వానిస్తూ యడ్డీ కటౌట్లు


బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి స్వాగతం.. సుస్వాగతం. ఈ కటౌట్లు బెంగళూరు నగరంలోని ప్యాలస్ గ్రౌండ్స్ ముందు దర్శనమిస్తున్నాయి. అయితే, ఇలా స్వాగతించింది కర్ణాటక బీజేపీ నేతలో, కార్యకర్తలో కాదు. కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) అధినేత, మాజీ బీజేపీ నేత యడ్యూరప్ప అనుచరులు ఏర్పాటు చేసినవి. తన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ఉవ్విళ్లూరుతున్న యడ్డీ అందులో భాగంగానే ఈ కటౌట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సభకు యడ్యూరప్పను బీజేపీ నేతలు ఆహ్వానించలేదు. ఒకవేళ యడ్డీ తనంతట తానుగా వస్తే వేదికపై కూర్చోబెట్టాలని నేతలు నిర్ణయించారు.

వాస్తవానికి 2014 ఎన్నికల ముందే కేజేపీని బీజేపీలో విలీనం చేయాలని యడ్యూరప్ప భావిస్తున్నారు. కానీ, అగ్రనేతలు అద్వానీ, సష్మాస్వరాజ్, కర్ణాటక బీజేపీ సీనియర్ నేతలు మాత్రం కొంత వేచిచూడడం మంచిదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యడ్డీని ఇప్పుడే పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ చేతికి ఆయుధాన్ని ఇచ్చినట్లు అవుతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News