: బెంగళూరులో మోడీ భారీ బహిరంగ సభ నేడే.. భారీ భద్రత


బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపికైన అనంతరం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ రెండో భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. ఇప్పటికే బీహార్ రాజధాని పాట్నాలో హుంకార్ పేరుతో పెద్ద సభ జరిగిన విషయం తెలిసిందే. కర్ణాటక బీజేపీ శ్రేణులు మోడీ సభకు బెంగళూరులో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి సుమారు నాలుగు లక్షల మంది ప్రజలను సభ జరిగే బెంగళూరు ప్యాలస్ గ్రౌండ్స్ కు తరలించేలా ఏర్పాట్లు చేశారు.

సభను విజయవంతం చేసి.. మోడీ ప్రభావంతో రానున్న లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవాలన్నది కర్ణాటక బీజేపీ నేతల ప్రయత్నం. సభా మైదానానికి 11 గంటలకు చేరుకునే మోడీ ఒంటిగంట తర్వాత అరగంటసేపు ప్రసంగించనున్నారు. మోడీని ముస్లిం ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకోవడం, పాట్నాసభ వద్ద పేలుళ్లకు పాల్పడిన నేపథ్యంలో బెంగళూరు సభకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 5 వేలమంది కానిస్టేబుళ్లు, 10 మంది డీసీపీలు భద్రతా ఏర్పాట్లను చూస్తున్నారు.

  • Loading...

More Telugu News