: వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. మిన్నంటిన శివనామస్మరణ
రాష్ట్రవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు దైవదర్శనం కోసం ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి, వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుడు, విజయవాడలోని దుర్గామల్వేశ్వర దేవస్థానం, పాలకొల్లు క్షీరారామేశ్వరుడు, తిరుమల, తిరుపతిలోని కపిలతీర్ధం, భద్రాచలం ఆలయాలు భక్తులతో నిండిపోయాయి.
గోదావరి, కృష్ణా నదుల్లో పవిత్ర స్నానాలు ఆచరించి శివనామస్మరణతో భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరారు. కార్తీక దీపాలను వెలిగించి తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. తిరుమలలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 22 వేల దేవాలయాలలో లక్షదీపారాధన నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.