: ఈ పెన్‌డ్రైవ్ అమ్మాయిలకే పనికొస్తుంది
...ఎందుకంటే, అమ్మాయిలే కదా లిప్‌స్టిక్ వేసుకునేది! కాబట్టి ఇది వారికే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఉద్యోగం చేసే మహిళల హ్యాండ్ బ్యాగుల్లో ఎక్కువగా ఉండే వస్తువుల్లో లిప్‌స్టిక్ ఒకటి. ఇక సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే అమ్మాయిల బ్యాగుల్లో లిప్‌స్టిక్‌తోబాటు పెన్‌డ్రైవ్ కూడా ఉంటుంది. ఈ రెండూ ఒకేదానిలో ఇమిడివుంటే అప్పుడు అది ఎక్కువగా అమ్మాయిల బ్యాగుల్లోనే కదా ఉంటుంది...
ఒకవైపు లిప్‌స్టిక్ మరోవైపు యూఎస్‌బీ ఉండేలా ఒక చక్కటి పెన్‌డ్రైవ్‌ను తయారుచేశారు. దీన్ని అవసరమైనప్పుడు తీసి చక్కగా పెదాల రంగును సవరించుకోవచ్చు... అలాకాకుండా ఏదైనా సమాచారాన్ని దాచుకోవాలంటే చక్కగా తీసి పెన్‌డ్రైవ్‌గా వాడుకోవచ్చు. ఇలా రెండు విధాలుగా ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. గర్ల్‌ఫ్రెండ్‌కు చక్కటి బహుమతి ఇవ్వాలంటే కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి!