: సచిన్ నిజంగా భారత రత్నమే: కపిల్ సిబాల్
సచిన్ టెండూల్కర్ దేశానికి నిజంగా భారత రత్నమేనని కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ అన్నారు. ఆయన సచిన్ కు 'భారతరత్న' ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, క్రీడాకారుడిగా సచిన్ చేసిన సేవ మరే క్రీడాకారుడూ చేయలేదని అన్నారు. భారత ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రకటించిందని కేంద్రాన్ని అభినందించారు. సచిన్ ఏళ్ల తరబడి భారత క్రికెట్ కి సేవలందిస్తూ దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశారని ఆయన పేర్కొన్నారు.