: వీధికో బెల్టు షాపు పెట్టి ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు: లోకేశ్


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వీధికో బెల్టు షాపు పెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటోందని ఆరోపించారు.

ఈ రోజు ఆయన వి.కోట మండల టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచిన సర్కారు విద్యుత్ సరఫరాను మాత్రం తగ్గించిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కనుచూపుమేరలో కనబడడంలేదని  అన్నారు.   

  • Loading...

More Telugu News