: 18.5 కోట్ల విలువైన బియ్యం స్వాధీనం
చిత్తూరు జిల్లా తనపల్లిలోని రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 18.5 కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు రైస్ మిల్లును సీజ్ చేసి విచారణ చేపట్టారు.