: విభజన అగుతుందనుకోను..అయినా ఆపేందుకు ప్రయత్నిస్తాం : రఘువీరా
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్ఠానం వెనక్కి తగ్గుతుందని తాను అనుకోవడం లేదని మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకూ ప్రయత్నిస్తామని అన్నారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి బిల్లు ఆపేలా ఒత్తిడి తెస్తామని ఆయన అన్నారు.