: సచిన్ సేవలు మరువలేనివి : ప్రధాని కార్యాలయం
క్రికెట్ ఆటకు సచిన్ అందించిన సేవలు మరువలేనివని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. లక్షలాదిమందికి ప్రేరణ కలిగించిన గొప్ప ఆటగాడు సచిన్ అని వెల్లడించింది. క్రీడా ప్రపంచానికి సిసలైన రాయబారి సచిన్ అని తెలిపింది. సచిన్ కు భారతరత్న ఇవ్వడం వల్ల దేశానికి మంచి సందేశం పంపినట్లవుతుందని కొనియాడింది.