: కేంద్ర మంత్రి పురంధేశ్వరికి చేదు అనుభవం
కేంద్ర మంత్రి పురంధేశ్వరికి తన నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. విశాఖపట్టణంలోని దక్షిణ నియోజక వర్గంలో ఈ రోజు రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఇందిరానగర్ కాలనీ వాసులు తమ కాలనీలో కనీస అవసరాలు కూడా కల్పించలేదని కేంద్ర మంత్రి పురంధేశ్వరిని నిలదీశారు. దీంతో కల్పించుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు కాలనీవాసులతో బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను అడ్డుకున్నారు. పోలీసులు కార్యకర్తలకు అనుకూలంగా వ్యవహరించడంతో... ప్రజలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.